హైదరాబాద్, వెలుగు: గాంధీభవన్లో ఆదివారం పీఏసీ భేటీ వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ‘‘నా ప్రయాణం ఆగదు.. నా పోరాటం ఆగదు.. ప్రజల కోసం నా అడుగు వెనక్కి పడదు”అని తెలిపారు. కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుసగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి తన పోరాటం ఆగదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
